పూజ గదిలో వచ్చే సుగంధపు వాసన వంట గదిలో రాదు. పడక గదిలో రావాల్సిన వాసనలైతే మరీ భిన్నంగా ఉంటాయి. ఎవరైనా అతిథులొచ్చినప్పుడు డ్రాయింగ్ రూమ్ గుభాళిఒంచిపోవాలంటే.. దానికో ప్రత్యేక ఏర్పాటు అవసరం. ఇలా ఇంటి వాతావరణాన్ని సమయానికి అనుగుణంగా మార్చుకోవడం అనేది తలకు మించిన పని. అందుకే.. Agan Aroma అనే సంస్థ.. సరికొత్త డివైస్‌ని మన ముందుంచింది.

సహజంగా.. గదిలో సువాసన కోసం రూమ్ ఫ్రెష్నర్ వాడతాం. కానీ.. ఇరవైనాలుగుగంటలూ ఇటువంటి ఒకే వాసనతో బోర్ కొట్టేవాళ్లకు గొప్ప రిలీఫ్ నిస్తుంది.. Moodo అనే ఈ సరికొత్త పరికరం. మన మూడ్‌ని అనుసరించి.. గదిలో దానికి తగిన సువాసన వెదజల్లడం Moodo పని. 139 డాలర్లు అంటే.. దాదాపు తొమ్మిదిన్నర వేల ఖరీదు చేసే ఈ మూడో డివైస్.. ఇప్పటికే శ్రీమంతుల ఇళ్లలో హల్చల్ చేస్తోంది.

మొత్తం ఆరు రకాల పెర్ఫ్యూమ్ క్యాప్సూల్స్ ని ఒకేసారి ఇందులో లోడ్ చేయవచ్చు. స్మార్ట్ ఫోన్‌లోని ఒక ప్రత్యేక యాప్ ఆధారంగా ఇది పని చేస్తుంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లతో అనుసంధానం చేయడం ద్వారా.. ఈ డివైస్ మన మూడ్‌ని ఎప్పటికప్పుడు పసిగడుతూ.. దానికి అనువైన సువాసనల్ని గదిలో డిఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఆరు రకాల పెర్ఫ్యూమ్‌ని సమయానికి తగ్గట్టు దానికదే అడ్జస్ట్ చేసుకుంటుంది కూడా. కుటుంబంలోని వ్యక్తుల ఫీలింగ్స్‌ని, అరోమాని అబ్జార్బ్ చేసుకుని, వాటినే పర్మనెంట్ సెట్టింగ్స్‌గా మార్చుకునే ఈ ‘మూడో’ పరికరం నాలుగైదు చదరపు అంగుళాల సైజులో కాంపాక్ట్‌గా ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *