కుదిరిన యూపీ లెక్క, మోదీ సర్కార్ వెన్ను విరిగినట్టే!

కుదిరిన యూపీ లెక్క, మోదీ సర్కార్ వెన్ను విరిగినట్టే!

ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ- బీఎస్పీల మధ్య పొత్తు పొడిచింది. నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికేందుకే పొత్తు పెట్టుకున్నట్టు మాయావతి- అఖిలేష్‌యాదవ్ శనివారం మధ్యాహ్నం బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాతే.. కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనకు వచ్చినట్టు తెలిపారు. ఈ పొత్తు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, సమాజంలోని కోట్ల మంది ప్రజలను కాపాడటానికే అని గుర్తు చేశారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవడమే తమ ధ్యేయమన్నారు.

మోదీ- అమిత్ షాలకు నిద్రలేని రాత్రులే ఎదురవుతాయని, యూపీ నుంచి వాళ్లని తరిమి‌కొట్టడం ఖాయమని మాయావతి ధీమా వ్యక్తంచేశారు. ఒక చారిత్రాత్మక అవసరమే ప్రాతిపదికగా కూటమి ఏర్పాటవుతోందన్నారు. మెజారిటీ ప్రజలు బీజేపీ సర్కార్‌పై అసంతృప్తితో వున్నారని, ఈ క్రమంలో యూపీ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీల కోసమేనని క్లారిటీ ఇచ్చారు. రెండు పార్టీలు చెరో 38 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఎస్పీ- బీఎస్పీ తేల్చేశాయి. మిగతా నాలుగు స్థానాల్లో అమేధీ, రాయ్‌బరేలి కాంగ్రెస్ ఖాతాలో వుంచుతూ, మరో రెండు సీట్లను రిజర్వులో వుంచనున్నట్టు అఖిలేష్- మాయా తెలిపారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *