మీ డోర్ బెల్ కి కళ్ళుంటాయ్ జాగ్రత్త..అది మీ మీద  ‘నిఘా నేత్రం’  పెట్టవచ్చు సుమా అని హెచ్చరిస్తున్నారు టెక్నాలజిస్టులు. ఇందుకు ఉదాహరణగా అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలోని  ‘డోర్ బెల్ కంపెనీ’  సృష్టించిన బెల్ నే సాధనంగా చెబుతున్నారు. ఇది ఎలా పని చేస్తుందోనని ప్రయోగించి చూశారు.

సంస్థ డోర్ కి ఈ బెల్ అమర్చి.. రింగ్ స్టాఫర్లకు 24 గంటలూ యూజర్ ఫుటేజీ అందేలా చూశారు. బెల్‌లోని లాక్స్ సెక్యూరిటీ సిస్టం పని చేయడం ప్రారంభించగానే ,కంపెనీలోని సర్వర్లు  కూడా ‘అలర్ట్’  అయ్యాయి. దీంతో బాటు ఎస్ 3 క్లౌడ్ స్టోరేజీ సర్వీసు కూడా పని చేయడంతో..రింగ్‌లోని ప్రతి చిన్న కెమెరా తీసిన వీడియో కళ్ళకు కట్టింది. రింగ్ స్టాఫ్ తమ కదలికలతో కూడిన కెమెరా ఫుటేజీని చూస్తున్నారన్న  విషయమే సిబ్బందికి తెలియలేదట.

తమ సిబ్బంది సెన్సిటివ్ కస్టమర్ డేటాను పొందకుండా చూసేందుకుఅమెజాన్ సంస్థ ఇలా పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఉక్రెయిన్ నుంచి వందకోట్ల డాలర్లకు ఈ రింగ్ డోర్ బెల్ కంపెనీని హస్తగతం చేసుకుంది. ఇలాంటి బెల్స్‌ను తలుపులకు అమర్చుకుంటే వచ్చినవారి ఆడియో, వీడియో కూడా క్యాప్చర్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా దొంగలను పట్టుకునేందుకు ఇలాంటి బెల్స్ ఎంతగానో ఉపకరిస్తాయట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *