నటి శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఆమెని చంపుతామని ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు దిగడమే దీనికి కారణం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఏం జరిగిందనే దానిపై లోతుల్లోకి వెళ్తే.. తెలుగులో అవకాశాలు తగ్గడంతో చెన్నైకి మకాం మార్చేసింది. వలసరవాక్కంలోని అన్బునగర్‌ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో అద్దెకు వుంటోంది. ఆమెపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్టు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది శ్రీరెడ్డి.

అందులో ఒకరు సినీ ఫైనాన్సియర్ సుబ్రమణి, మరొకరు అతడి అసిస్టెంట్ గోపి. మార్చి 21న మిడ్‌నైట్‌లో తానున్న అపార్టుమెంటుకు వచ్చి తనపై దాడి చేశారని, ఆపై చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఫైనాన్సియర్ సుబ్రమణి హైదరాబాద్‌కి వచ్చినప్పుడు ఓ కేసులో పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి వెళ్లడం తెలుసుకున్న సదరు ఫైనాన్షియర్.. ఆమెని బెదిరించినట్లు అంతర్గత సమాచారం. ప్రస్తుతం ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *