నెట్టింట్లో కూర్చుని కుర్రాళ్లని కైపెక్కించే పనిని కాసేపు పక్కనపెట్టి కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని తలెకెత్తుకున్న సౌతిండియా సినీతార శ్రీరెడ్డి మళ్లీ పాతరూట్లోకొచ్చేసింది. హుం..హం.. అంటూ కాసేపు కెమెరా ముందు వయ్యారాలు పోయిన శ్రీరెడ్డి చివరికి ఎందుకు అలగాల్సి వచ్చిందో చెప్పేసింది. ‘ఏం లేదు మరేమో.. నేను ఎందుకు అలిగానంటే మా చిన్న మావయ్య అదేనండి.. హీరో వెంకటేష్ గారి పాప పెళ్లికి నాకు కార్డ్ ఇవ్వలేదు.. పిలవలేదు. నేను అఫీషియల్ కోడల్ని కాకపోయినా ఇన్‌డైరెక్ట్‌గా కోడల్నే కదా. నన్ను కూడా పిలిచి ఉండుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటూ నవ్వుతూ కొద్దికొద్దిగా ఏడుస్తూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు, వెంకటేష్ బాబు గారి పాప మ్యారేజ్ సెట్ అయ్యింది. లవ్ కమ్ ఎరేంజ్డ్ మ్యారేజ్. ఆ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి రెడ్డీస్ అబ్బాయి. కంగ్రాట్స్ వెంకటేష్ గారూ.. మీ పాప హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ ఆశీర్వాదం కూడా ఇచ్చింది. అంతటితో ఆగని శ్రీరెడ్డి, అభి దగ్గుబాటితో తన అనుభవాల్ని గుర్తుకు తెచ్చుకుని కాసేపు కలత చెందింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *