శ్రీదేవి అత్తగారు ఏమన్నారు?

ఎంత గొప్ప సెలబ్రిటీలైనా.. వాళ్ళవాళ్ళ ఇళ్లల్లో కూడా సినిమా కష్టాలుండకుండా వుండవు! దక్షిణాది నుంచి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. కపూర్ ఫ్యామిలీకి కోడలుగా ఎలా వెళ్లిందన్న బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే. అప్పటికే పెళ్లయి ఒక బిడ్డకు తండ్రిగా వున్న ప్రొడ్యూసర్ బోనీ కపూర్.. శ్రీదేవితో ప్రేమలో పడ్డారు. భార్య మోనా శౌరికి విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నారు.

అయితే.. తన కొడుకు కాపురంలో చిచ్చుపెట్టిందన్న కోపం.. శ్రీదేవి మీద అప్పట్నుంచే బోనీ కపూర్ తల్లికి ఉండేదట. అనేకసార్లు అత్తాకోడళ్ల మధ్య ఈ విషయమై గొడవలు జరిగేవి. ఒకసారి పదిమంది ముందూ శ్రీదేవిని ఆమె అత్తగారు కడుపులో గుద్దింది కూడా. ఇవన్నీ బాలీవుడ్ మొత్తం హల్చల్ చేసిన విషయాలే! తాజాగా శ్రీదేవిని కోల్పోయిన ఒక కరడుగట్టిన అభిమానిగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కడుపు చించుకున్నాడు. ఫేస్ బుక్ లో శ్రీదేవి పేరు మీద ఒక ‘ఓపెన్ లవ్ లెటర్’ రాస్తూ.. ఈ విషయాలన్నీ ఏకరువు పెట్టాడు వర్మ. తనకు తెలిసినంతవరకూ శ్రీదేవి బతుకంతా కష్టాలేనని, ఏ ఒక్కరోజు కూడా ఆమెను ఈ ప్రపంచం సంతోషంగా ఉండనివ్వలేదని ఆ లేఖలో రాసుకొచ్చాడు వర్మ.