శ్రీదేవి చివరి డ్యాన్స్ వీడియో

అతిలోక సుందరి శ్రీదేవికి సంబంధించి చివరి వీడియోస్ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె.. దుబాయ్‌లో ఓ మ్యారేజ్ ఫంక్షన్‌కి హాజరుకాగా, పెళ్లిలో భర్త బోనీకపూర్‌తో కలిసి డ్యాన్స్ చేసింది శ్రీదేవి. ఇదే ఆమె చివరి వీడియో! డ్యాన్స్ సమయంలో భర్తతో కలిసి హ్యాపీగానే కనిపించింది… తనదైన శైలిలో స్టెప్పులేసింది. వున్నట్టుండి ఆమెకి గుండెపోటు ఎలా వచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.


 

మరోవైపు శ్రీదేవికి ఎప్పుడు గుండెపోటు రాలేదని, హఠాన్మరణంతో కుటుంబం మొత్తం షాక్‌కు గురైందన్నాడు ఆమె మరిది, బాలీవుడ్ నటుడు సంజయ్‌కపూర్. ఆమె మరణించిన విషయాన్ని ఫస్ట్ మీడియాకి చెప్పింది అతడే! మేనల్లుడి పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫ్యామిలీ.. జుమేరియా ఎమిరేట్స్ టవర్ హోటల్లో బస చేసింది. అర్ధరాత్రి సమయంలో గుండెపోటు రావడంతో బాత్‌రూమ్‌లోనే స్పృహ తప్పి పడిపోయారని, వెంటనే దగ్గర్లోని రషీద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆమెకి గుండెపోటు వచ్చినట్లు ఖలీజ్ టైమ్స్‌కు చెప్పాడు సంజయ్.