స్టార్ హీరోల పాలిట స్టార్ డైరెక్టర్గా పేరున్న కొరటాల శివ.. ఇప్పుడు మెగాస్టార్ మూవీ కోసం బిజీగా వర్కవుట్స్ చేస్తున్నాడు. ఈ గ్యాప్లోనే మరోసారి.. లైన్లోకొచ్చేసింది ‘కాస్టింగ్ కౌచ్’ ఫేమ్ శ్రీరెడ్డి. కొరటాల శివను ఇరిటేట్ చెయ్యడమనే ప్రాజెక్టులో రెండో ఎపిసోడ్ మొదలుపెట్టేసిందావిడ. ‘కొరటాల లాంటి దగుల్బాజీ క్యారెక్టర్ ప్రపంచంలో మరెవ్వడూ ఉండడు..’ అంటూ తీవ్ర పదజాలంతో దాడి షురూ చేసింది శ్రీరెడ్డి. అక్కడితో ఆగకుండా ‘నా మీద నేను బయోపిక్ తియ్యడానికి అనుమతిస్తే.. అందులో కొరటాల శివకు ప్రముఖ పాత్ర ఉంటుంది’ అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్‌ని మళ్ళీ కెలికేసింది.

Koratala siva no1 worst character in this world..if I allow a bio pic of mine, he wl hv a major part in that film..

Posted by Sri Reddy on Monday, February 18, 2019

గత మార్చి, ఏప్రిల్ నెలల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్రస్థాయి కలకలం రేపిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంది. పరిశ్రమలో వేళ్లూనుకున్న ‘క్యాస్టింగ్ కౌచ్’పై ఉద్యమం లాంటిది లేవనెత్తి.. అది కాస్తా బూమరాంగ్ అయ్యేసరికి చప్పుడు చెయ్యకుండా ఉండిపోయింది. అంతకుముందు.. అభిరాం దగ్గుబాటితో మొదలుపెట్టి.. కోనా వెంకట్, కొరటాల శివ, శేఖర్ కమ్ముల లాంటి నలుగురు సెలబ్రిటీలకు సంబంధించిన చాట్ స్క్రీన్ షాట్స్‌ని బైటపెట్టి.. సంచలనం సృష్టించింది. అప్పట్లో ‘భరత్ అనే నేను’ మూవీ ప్రమోషన్లో బిజీగా వున్న కొరటాల.. కొన్నాళ్ళు నిశ్శబ్దంగా వుండి.. చివరకు సెల్ఫ్ వీడియో మెసేజ్ ద్వారా తన వెర్షన్ వినిపించారు.

ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని, ‘కాస్టింగ్ కౌచ్’కి తాను పూర్తి విరుద్ధమని క్లారిటీ ఇచ్చారు కొరటాల శివ. అప్పటికి సర్దుమణిగిందనుకున్న శ్రీరెడ్డి-కొరటాల ఎపిసోడ్.. 10 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ మొదలైనట్లయింది. శ్రీరెడ్డి చేసిన తాజా ట్వీట్ పర్యవసానం ఏమిటన్నది తేలాల్సివుంది. మెగా మూవీ కోసం సిట్టింగ్స్‌లో వున్న కొరటాలను డిస్టర్బ్ చేయాలన్నదే శ్రీరెడ్డి ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తమ్మీద ఇది టాలీవుడ్ కప్పులో మరో తుపానులా మిగిలిపోతుందా? లేక నిజమైన ఉప్పెనకు దారితీస్తుందా? చూడాలి. ఇదిలా ఉంటే.. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న ‘లక్ష్మీస్ వీరగంధం’ మూవీలో ఎన్టీయార్ రెండో భార్యగా లక్ష్మీపార్వతి పాత్రకు శ్రీరెడ్డి ఓకే అయినట్లు సమాచారం. ఆ సినిమా ప్రమోషన్ కోసం ఆమె ఈవిధమైన ‘ప్రచారం’ మొదలుపెట్టిందని చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *