‘ఎన్టీఆర్‌’ ఐటెం సాంగ్‌లో ఆమె

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు.. తెలుగుప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ‘ఎన్టీఆర్’ సినిమా షూట్ జోరుగా సాగుతోంది. భారీతారాగణంతో టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలోకి మరో స్టార్‌ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్యతోపాటు విద్యాబాలన్, మోహన్‌ బాబు, రానా, కీర్తి సురేష్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తుండగా.. తాజాగా ఈ జాబితాలోకి స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా చేరింది. సినిమాలోని కీలక సన్నివేశంలో వచ్చే పాట కోసం రకుల్‌ ప్రీత్ సింగ్‌ని సంప్రదించినట్లు, ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, కలర్ మూవీస్ వచ్చాక ఎన్టీఆర్‌ సినిమాల్లోని చాలా ఐటెమ్‌ సాంగ్స్ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. దీంతో.. ఏ పాటలో రకుల్‌ప్రీత్ అలరిస్తుందో చూడాలి. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.