మేరీ రోజ్.. ప్రపంచ ప్రసిద్ధ యుద్ధనౌకల్లో ఒకటి. 15వ శతాబ్దం నాటి ఇంగ్లీష్ ఎంపరర్.. కింగ్ హెన్రీ -VIII కి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నౌక మూడు భారీ సైజు తెరచాపలతో నడిచేది. అప్పట్లో ఫ్రాన్స్, స్కాట్లాండ్ లతో జరిగిన యుద్ధాల్లో దాదాపు 33 ఏళ్ల పాటు దీని హవా బాగా నడిచింది. చివరకు ఫ్రాన్స్ దండయాత్రను ఎదుర్కొనే క్రమంలో సోలెంట్ యుద్ధ సమయంలో మునిగిపోయింది.

36 ఏళ్ల కిందట మేరీ రోజ్ అవశేషాల్ని గుర్తించి.. సముద్రగర్భం నుంచి వెలికితీశారు. మొట్టమొదటి సారిగా వీటిని Portsmouth మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టాలని నిర్ణయించారు. నౌకకు చెందిన కీలక భాగాలైన స్టెమ్, పంప్, యాంకర్‌లను ఎగ్జిబిషన్ కోసం సిద్ధం చేశారు. 474 సంవత్సరాల కిందటి ఈ అరుదైన యుద్ధ జ్ఞాపకాన్ని చూడడానికి బ్రిటన్ జనం ఆసక్తి కనబరుస్తున్నారు.

రీసెర్చ్ క్యూరేటర్ డాక్టర్ Alexzandra Hildred, 1979 నుంచి మేరీ రోజ్ పునరుద్ధరణ ప్రక్రియ కోసం పని చేస్తున్నారు. అప్పుడు మొదలైన మేరీ రోజ్ ట్రస్ట్ ఈ 4 దశాబ్దాల కసరత్తును ఎట్టకేలకు పూర్తి చేయగలిగింది.

మేరీ రోజ్ ట్రస్ట్ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. 4 శతాబ్దాల పాటు ఇంగ్లీష్ కాలువ అడుగుభాగాన సేదదీరిన మేరీ రోజ్ యుద్ధనౌక.. శకలాల రూపంలో ఇప్పుడు జనం ముందుకు రాబోతోందన్న మాట. ఇదొక అరుదైన విషయమని బ్రిటన్ మెరైన్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *