పిల్లలు పుట్టనంతవరకూ ఓకె ! తలిదండ్రులకు రాత్రుళ్ళు భేషుగ్గా నిద్ర పడుతుంది. కలల లోకంలో విహరిస్తారు. అయితే బిడ్డ పుట్టాడా ! ఇక అంతే
సంగతులు.. గాఢ నిద్రకు వాళ్ళు స్వస్తి చెప్పాల్సిందే. తాము నిద్రలో ఉండగా.. గుక్క పట్టి బిడ్డ ఏడుపు లంకించుకుంటే స్లీప్ ఇట్టే ఎగిరిపోతుంది. ఇది అన్ని దేశాల్లోని తలిదండ్రులకు అనుభవమే.. అయితే బ్రిటన్, జర్మనీ దేశాల్లోని యూనివర్సిటీల రీసెర్చర్లు ఇదో సరికొత్త విషయం లా స్టడీ చేసి..చేసి..తమ అధ్యయనంలో దీని గురించి తెలిపారు.

అనేకమంది పేరెంట్స్ ను ఇంటర్వ్యూలు చేసి వీళ్ళు చెబుతున్నదేమిటంటే..పిల్లలు పుట్టిన ఆరేళ్ళ వరకూ వీరికి ‘ నిద్రా సుఖం ‘ ఉండదట.. కంటినిండా నిద్రకు నోచుకోక సతమతమవుతారట. ముఖ్యంగా జర్మనీ లో రెండున్నర వేలమంది మహిళలను, సుమారు రెండు వేలమంది పురుషులను అధ్యయనం చేసి.. తామీ విషయాన్ని వెల్లడిస్తున్నామని ఓ ఆర్టికల్ లో తెలిపారు. అలాగే బిడ్డలకు స్తన్యమిచ్చే తల్లులు కూడా కనీసం నాలుగైదు గంటలయినా నిద్ర పోలేరని అంటున్నారు. అనేకమంది గర్భిణులకూ ఇలాంటి అనుభవమే కలుగుతుందని చెబుతున్నారు ఈ పరిశోధకులు. కానీ..స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా.. సేమ్ ఎక్స్ పీరియన్స్ తప్పదన్నదే వీళ్ళిస్తున్న కన్ క్లూజన్ !

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *