నార్వే తీరంలోని ఒక ఖరీదైన, అందమైన దీవి.. ఇప్పుడు ఖరీదుకొచ్చింది. జీరహోల్మన్ అనే ముద్దు పేరున్న ఈ అద్భుత ద్వీపం.. కేవలం 1.1 ఎకరం కంటే మించని వైశాల్యంతో చూడముచ్చటగా వుంది.

‘స్మాల్ అండ్ గ్రీన్’ అంటూ శ్రీమంతులంతా ఇష్టపడే ఈ చిట్టి దీవి.. పచ్చటి లష్ చెట్ల సముదాయంతో ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటుంది. 1.7 మిలియన్ పౌండ్ల ధర పలుకుతోంది. ఇండియన్ రూపీస్ లో 15 కోట్లకు పైమాటే!

ఈ దీవి కొనుగోలు కోసం ఎగబడుతున్న బిగ్ షాట్స్ అందరూ.. ఆ ఐలాండ్ కంటే.. అందులోని ఫోర్ బెడ్‌రూమ్ ప్రాపర్టీ మీదే పెద్దగా కన్నేశారట. కనీసం 15 మంది సౌకర్యవంతంగా బస చేసే ఏర్పాటుందక్కడ.

వుడ్ ప్యానల్‌తో రూపుదిద్దుకున్న కిచెన్, లివింగ్ రూమ్, అందమైన లాన్.. వెరసి ఈ అమేజింగ్ ప్రైవేట్ ఐలాండ్ ప్లాట్ చుట్టుపక్కల దేశాల్లో ఇప్పుడొక హాట్ కేక్.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *