రోడ్డుమీద వేగంగా వస్తున్న వాహనం తృటిలో ఓ వ్యక్తిని ఢీ కొనబోతే ఆ వ్యక్తిని ప్రాణాలకు తెగించి రక్షించే వాళ్ళుంటారంటే అనుమానమే..కానీ జంతువుల్లోనూ ఇలాంటి ‘ సాహసోపేతమైవవి ‘, సమయస్ఫూర్తి, తెలివితేటలూగలవి ఉంటాయి మరి.. ఉదాహరణకు కెనడాలోని క్యూబెక్ నగరంలో గల గాస్పే సిటీనే తీసుకుందాం. అక్కడ అచ్చు ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటనే జరిగింది. ఆ సిటీలో ఎత్తయిన మంచు కొండ ప్రాంతంలో నివసిస్తోందో మహిళ. తన ఇంట్లో ఓ కుక్కను, దాని పిల్లలను అపురూపంగా పెంచుకుంటోంది.

ఈ మధ్య తన కారును ఆమె రివర్స్ చేయబోగా..అది కాస్త వేగంగానే కదిలింది. అయితే అప్పుడే అటు పరుగెత్తుతూ దాని కింద పడబోయింది ఓ కుక్క పిల్ల. కొద్ది దూరంలోనే ఉన్న దాని తల్లి ఇది గమనించిందో ఏమో ! పరుగున వచ్చి ఆ పిల్లకుక్కను వెనక్కి లాక్కుని పోయి దాని చిన్ని ప్రాణాన్ని రక్షించింది. తన కారులోని మిర్రర్‌లో ఈ సీన్ చూసిన ఆ మహిళ ఆశ్చర్యపోయింది. కారు ఆపేసి, వెంటనే వెళ్లి ఆ తల్లీ కుక్కపిల్లలను ముద్దుల్లో ముంచెత్తింది. అంతే కాదు.. ఆ తల్లిప్రేమ పట్ల ఆశ్చర్యపోయింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *