టాలీవుడ్‌లో విడుదలకు సిద్ధమైంది మరో చిన్న సినిమా ‘స్వయంవద’. అన్ని పనులు పూర్తికావడంతో రెండు నిమిషాల నిడివగల ట్రైలర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘మన రాత గిర్రున తిరగబోతుంది.. ఈ బినామీ సునామీ కాబోతున్నాడంటూ పోసాని కృష్ణమురళి డైలాగ్‌తో ప్రేక్షకుల షాకవ్వడం ఖాయం. పోసాని.. తన కొడుకుని ‘స్వయంవద’తో పెళ్లి చేయిస్తాడు. ఆ తర్వాత హీరోకి చుక్కలు చూపిస్తూ ముప్పుతిప్పలు పెడుతుంది హీరోయిన్.

అరుదైన బ్లడ్ గ్రూప్ చెందిన ‘స్వయంవద’కు చిన్న అవమానం జరిగినా తట్టుకోలేదు, ఆమె బాగా ధనవంతులరాలు కావడంతో అవమానం అంటే అస్సలు పడదు.. పొరపాటున చేయి తగిలినా.. బీర్ బాటిల్ పగలుగొట్టి పొట్టలో దించేస్తుంది. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయికి దెయ్యం కూడా పడుతుంది. ఇందులో పోసాని, ధనరాజ్‌లు తప్పితే మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే! ట్రైలర్‌ని చూసినవాళ్లు మాత్రం సీరియల్‌కి ఎక్కువ.. సినిమాకి తక్కువ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *