తాప్సి చెల్లెలు ఇప్పుడు సేఫ్!

ఢిల్లీ చిన్నది తాప్సి పన్ను ఇప్పుడు పెద్దదయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ చక్కర్లు కొడుతూ బిజీగా మారింది. కెరియర్లో గొప్ప విజయాలంటూ ఏమీ లేకపోయినా.. గ్లామర్ వరల్డ్ లో పింక్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుని స్థిరపడిపోయింది. ‘ఝుమ్మంది నాదం’తో తెలుగు యువ ప్రేక్షక లోకానికి బాగా దగ్గరైంది కూడా. ఇప్పుడామె చేతిలో ‘ముల్క్‌’, ‘సూర్మా’ అనే రెండు సినిమాలున్నాయి. మోడల్ గా వున్నప్పటి నుంచి ఇప్పటివరకూ డజనుకు పైగా బ్రాండ్స్ కి ఎండార్స్ చేసిన తాప్సి బుల్లితెర మీద కూడా మంచి కమర్షియల్ డాల్! ఈ జర్నీలో ఆమె దాటొచ్చిన ముళ్ళూ పూలూ ఎన్నో లెక్క లేదు. సినిమా ఫీల్డ్ అంటేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రగుల్ అంటూ అప్పుడప్పుడూ మెసేజిలిస్తుంటుంది కూడా. ఇప్పుడు అదే ముళ్ల బాటలోకి చెల్లెలు షగున్ ని కూడా లాక్కొచ్చేస్తోంది.

”ఆమెకి చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ప్రాణం. స్క్రీన్ అప్పియరెన్స్ కోసం తాను పడే తాపత్రయం చూస్తే నాకే ముచ్చటేస్తుంది. కానీ.. నేను పడ్డ కష్టాల్ని ఆమెను పడనివ్వను. తొలి దశలో దొరికిన ప్రతి సినిమానూ చెయ్యాలన్న తపన నాది. అందుకే నానా కష్టాలు పడ్డా. షగున్ ని మాత్రం మంచిగా డైరెక్ట్ చేసి.. తనకు హెల్తీ కెరీర్ ఇప్పిస్తా” అంటోంది తాప్సి పన్ను. ఢిల్లీ అశోక్ విహార్ కలిసి పెరిగిన ఈ అక్కచెల్లెళ్ళిద్దరూ గ్లామర్ వరల్డ్ లో కూడా ‘ట్విన్స్’లా జర్నీ చేయాలని తపిస్తున్నారు. ప్రస్తుతం.. పర్సనల్ ప్రమోషన్ కోసం షగున్  తాప్సి స్పైసీ ఫోటో షూట్స్ చేస్తూ బిజీగా వుంది.