‘కరాచీ’ బేకరీ..పేరుతో వచ్చింది పేచీ

‘కరాచీ’ బేకరీ..పేరుతో వచ్చింది పేచీ

పుల్వామా ఘటనలో 40 మందికి పైగా జవాన్లు మరణించడంతో..పాకిస్తాన్‌పై ఇండియాలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమంటున్నాయి. పాకిస్తాన్‌లోని కరాచీ సిటీ… ఇక్కడి అదే పేరిట ఉన్న బేకరీకి డేంజర్‌గా పరిణమించింది. బెంగుళూరు, హైదరాబాద్, సహా పలు నగరాల్లో ‘కరాచీ బేకరీ’ షాపులు కొనసాగుతున్నాయి.…

మళ్ళీ రగులుతున్న ‘అయోధ్య’

మళ్ళీ రగులుతున్న ‘అయోధ్య’

యూపీలోని అయోధ్యలో అతి పెద్ద రామమందిర నిర్మాణం కోసం హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సన్నాహాలు చేస్తుండగా.. ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. అయితే అమిత్ షా వంటి బీజేపీ అగ్ర నేతలు అక్కడ రామాలయం నిర్మించాల్సిందేనంటూ తమ గళాన్ని…

అయోధ్యలో రామ మందిరం.. ముస్లిముల్లో కలవరం

అయోధ్యలో రామ మందిరం.. ముస్లిముల్లో కలవరం

యూపీలోని అయోధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మాండమైన రామ మందిరాన్ని నిర్మించాలని  మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ఉన్న మసీదు స్థానే రాముడిగుడిని కట్టాలన్న బీజెపీ  నేతల దృఢ నిర్ణయం.తో . ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న దాదాపు అయిదు వేలమంది ముస్లిముల్లో అభద్రతా భావం నెలకొంది. గతంలోవివాదాస్పద స్థలం వద్ద తలెత్తిన పరిణామాలు పునరావృతం కావచ్చునని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ గుడిని నిర్మిస్తే ఇక తమ మనుగడ ప్రమాదంలోపడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కాషాయ రెపరెపలు అక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ స్వయంగా ఈ అంశంపై చొరవచూపడం, వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్ తేవాలన్న ప్రతిపాదనకు దాదాపు అన్ని విపక్షాల మద్దతు లభించడం వీరికి నిద్ర పట్టకుండాచేస్తోంది. ఇటీవల అయోధ్యను సందర్శించిన ఓ మీడియా బృందం వద్ద అనేకమంది ముస్లిములు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారులు ఇకతాము ఈ ప్రాంతాన్ని వదిలి వేయక తప్పదని దిగాలుగా తెలిపారు. సీఎం  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూడా తమ రక్షణ విషయంలో ఎలాంటి హామీని ఇవ్వలేదనివాపోతున్నారు.