తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్ ) 2019 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 6 వ తేదీన డాలస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశం లో ప్రకటించారు. ఈ సందర్బంగా శ్రీ వీర్నపు చినసత్యం సంస్థ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు స్వీకరించారు. టాంటెక్స్ లాంటి గొప్ప సంస్థకి 33వ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని సత్యం చెప్పారు. ఉత్తర అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్ ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు టాంటెక్స్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ ప్రమాణాలను మరింతపెంచే దిశగా నూతన కార్యక్రమాలను ఈ సంవత్సరం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఇందుకు కార్య నిర్వాహక బృందము మరియు పాలక మండలి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం ఇలా ఉంది :

అధ్యక్షుడు : వీర్నపు చినసత్యం
సంయుక్త కార్యదర్శి : తోపుదుర్తి, ప్రభంద్ రెడ్డి
ఉత్తరాధ్యక్షుడు: కోడూరు కృష్ణారెడ్డి
కోశాధికారి: ఎర్రం శరత్
ఉపాధ్యక్షులు : పాలేటి లక్ష్మి
సంయుక్త కోశాధికారి: బొమ్మ వెంకటేష్
కార్యదర్శి : పార్నపల్లి ఉమామహేష్
తక్షణ పూర్వాధ్యక్షులు: శీలం కృష్ణవేణి, కాజ చంద్రశేఖర్, మండిగ శ్రీలక్ష్మి, మనోహర్ కసగాని, జొన్నల శ్రీకాంత్ రెడ్డి, కొండా మల్లిక్, మెట్టా ప్రభాకర్, తాడిమేటి కళ్యాణి, లంక భాను, ఇల్లెందుల సమీర, బండారు సతీష్, చంద్రా రెడ్డి పోలీస్, యెనికపాటి జనార్ధన్, కొణిదాల లోకెష్ నాయుడు

పాలక మండల బృందం :
అధిపతి : ఎన్. ఎం.యస్. రెడ్డి,
ఉపాధిపతులు: నెల్లుట్ల పవన్ రాజ్, కన్నెగంటి చంద్రశేఖర్, కొనార రామ్, మందాడి ఇందు రెడ్డి, ఎర్రబోలు దేవేందర్, డా. పామడుర్తి పవన్

కొత్త పాలక మండలి మరియు కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2019 లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ తప్పక ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు చినసత్యం ఈ సందర్భంగా తెలిపారు. 2018 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షురాలు గా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షురాలు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ.. వీర్నపు చినసత్యం గారి నేతృత్వంలో ఏర్పడిన 2019 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *