ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో నేతలు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. టికెట్ రాదని తేలిపోవడంతో కొత్త పార్టీల వైపు వెళ్లడం మొదలుపెట్టారు. ఆమంచి, అవంతి బాటలోనే అమలాపురం టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ రాదని భావించిన ఆయనతో కొద్దిరోజులుగా వైసీపీ వర్గాలు సంప్రదింపులు జరిపారు. ఇందులోభాగంగా సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో జగన్‌ను ఆయన కలిసి కండువా మార్చేశారు. రవీంద్రబాబును అవంతి శ్రీనివాస్ దగ్గరుండి తన కారులో జగన్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడి వైసీపీలతో భేటీ తర్వాత జగన్‌తో సమావేశమయ్యారు.

కొద్దిరోజులుగా అమలాపురం టికెట్ ఎవరి ఇవ్వాలా అన్నదానిపై వైసీపీ తర్జనభర్జన పడుతోంది. సరైన నాయకుడి కోసం సెర్చింగ్ మొదలుపెట్టింది. ఈక్రమంలో రవీంద్రబాబు.. ఫ్యాన్ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అమలాపురం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పలుమార్లు వార్తల్లో నిలిచారు ఈ ఎంపీ. ఐఆర్ఎస్ సర్వీసెస్‌కు చెందిన పందుల రవీంద్రబాబు.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2014లో అమలాపురం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికైన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *