ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యాన ఢిల్లీలో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధికారప్రతినిది సాధినేని యామిని ‘ తెలుగు తల్లి ‘ వేషంలో అందర్నీ ఆకట్టుకున్నారు. ‘ నా తల్లి భరతమాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం ‘ అని రాసి ఉన్న ప్లకార్డును చేత బట్టుకుని ఆమె సంచలనం రేపింది. తన’ కుమారుడు చంద్రబాబు నాయుడు’ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మోదీని నిలదీస్తూ అలుపెరగని పోరాటం చేస్తుంటే మరో ‘ కుమారుడు ‘ వై.ఎస్.జగన్ అదే మోడీకి మద్దతునిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ‘ నా కుమారుడు (జగన్) దారి తప్పితిరుగుతున్నాడు. అతడ్ని దారి లోకి తెచ్చే బాధ్యత ప్రజలదే ‘ అని సాధినేని యామిని పేర్కొంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *