సీట్ల లొల్లికి పుల్‌స్టాప్ పెట్టేసింది టీడీపీ అధిష్టానం. విస్తృత కసరత్తు తర్వాత పార్టీ హైకమాండ్, సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 25 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను వెల్లడించింది. అందులో పది మంది సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చిన సీఎం చంద్రబాబు, నలుగురు వారసులను పోటీకి దించారు. 15- ఓసీలు, 5- బీసీలు, 4-ఎస్సీలు, ఒకటి ఎస్టీకి ఇచ్చింది టీడీపీ. అరకు నుంచి కిషోర్ చంద్రదేవ్, విశాఖ నుంచి గీతం విద్యాసంస్థల అధినేత మూర్తి మనవడు భరత్ పోటీకి దిగారు. అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, నర్సాపురం, ఒంగోలు, కడప, రాజంపేట, నంద్యాల, తిరుపతి కొత్త అభ్యర్థులు తమతమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు.

లోక్‌సభ అభ్యర్థులు..

1. శ్రీకాకుళం- రామ్మోహన్‌ నాయుడు
2. విజయనగరం- అశోక్‌ గజపతిరాజు
3. అరకు- కిషోర్‌ చంద్రదేవ్‌
4. విశాఖ- భరత్‌
5. అనకాపల్లి- ఆడారి ఆనంద్‌
6. కాకినాడ- చలమలశెట్టి సునీల్‌
7. అమలాపురం- గంటి హరీష్‌
8. రాజమండ్రి- మాగంటి రూప
9. నర్సాపురం- వేటుకూరి వెంకట శివరామరాజు
10. ఏలూరు- మాగంటి బాబు
11. విజయవాడ- కేశినేని నాని
12. మచిలీపట్నం- కొనకళ్ల నారాయణ
13. గుంటూరు- గల్లా జయదేవ్‌
14. నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు
15. బాపట్ల- శ్రీరాం మాల్యాద్రి
16. ఒంగోలు- శిద్దా రాఘవరావు
17. నెల్లూరు- బీదా మస్తాన్‌రావు
18. కడప- ఆది నారాయణరెడ్డి
19. హిందూపురం- నిమ్మల కిష్టప్ప
20. అనంతపుం- జేసీ పవన్‌రెడ్డి
21. నంద్యాల- మాండ్ర శివానంద్‌రెడ్డి
22. కర్నూలు- కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
23. రాజంపేట- డీకే సత్యప్రభ
24. తిరుపతి- పనబాక లక్ష్మి
25. చిత్తూరు- శివప్రసాద్‌

 

అటు అసెంబ్లీ సీట్ల విషయంలో ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన టీడీపీ, పెండింగ్‌లో వున్న 36 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 175 సీట్లలో 97 మంది సిట్టింగులకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు, 13 మందికి మొండిచేయి చూపారు. అందులో కొంతమంది పార్లమెంటు బరిలో నిలిచారు. వారసులతో కలిపి 46 మందిని కొత్తగా ఎన్నికల బరిలో దించారు. ఓవరాల్‌గా చూస్తే.. 93 మంది ఓసీలు, 46- బీసీలు, 36- ఎస్టీ, ఎస్సీలకు చోటు కల్పించారు. 14 మంది నేతల వారసులను బరిలోకి దించారు. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు కూతురు అదితి, భీమిలి- సబ్బం హరి, కర్నూలు- టీజీ భరత్‌, నంద్యాల- భూమా బ్రహ్మానందరెడ్డి చోటు దక్కించుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *