ఇటీవల టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు ఆ పార్టీ షాకిచ్చింది. ఆయనకు పెడన అసెంబ్లీ, లేదా మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వవచ్చునని ప్రచారం జరిగింది. అయితే సోమవారం రాత్రి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఆయన మద్దతుదారులను దిగ్భ్రాంతి పరిచింది.  కొన్ని సమీకరణాల నేపథ్యంలో రాధాను కేవలం ప్రచారానికే  పరిమితం చేయాలని భావిస్తున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల అనంతరం రాధాకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు. టీడీపీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో  జరిపే ప్రచారంలో రాధా… వైసీపీ అధినేత జగన్ తీరును ఎండగట్టవచ్చునని భావిస్తున్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *