శిలాజాల దంతాల్ని పరీక్షించడం ద్వారా.. పురాతన నాగరికతల గురించిన ప్రతి అంశాన్నీ పసిగట్టవచ్చంటారు ఆర్కియాలజిస్టులు. పళ్ళ తీరు, వాటి పటిష్టతను బట్టి వాటిని కలిగిన జంతువుల జీవన శైలిని, ఆహార నియమాల్ని, అవెందుకు చనిపోయాయన్న కారణాల్ని కూడా తేల్చివెయ్యడం పురాతత్త్వ శాస్త్రవేత్తల ప్రొఫెషనల్ సీక్రెట్. కానీ.. తాజా పరిశోధనల ప్రకారం.. మనిషి నోటిలోని ఎముకల్ని పరికించి చూస్తే.. సదరు మనిషి భవిష్యత్తును కూడా చెప్పవచ్చట. అవును.. ఇదొక నమ్మలేని నిజం.

నోటి దంతాలు మనిషి మానసిక ఆరోగ్య లక్షణాల్ని బైటపెడతాయట. మానసిక ఒత్తిళ్లను, ఆందోళన స్వభావాన్ని, బైపోలార్ డిజార్డర్ లాంటి అనేక రకాల మనోవైకల్యాల్ని నోటిలోని పళ్ళ స్వభావాన్ని బట్టి తెలుసుకోవచ్చని.. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ డాక్టర్ లెనిన్ డన్ చెబుతున్నారు. ఆరేళ్ళ వయసున్న 37 మంది పిల్లల పాలపళ్ళను సేకరించి.. ఒక లోతైన అధ్యయనం చేసిన తర్వాత తేలిన విషయమిది. పిల్లల్లో అప్పుడున్న బిహేవియర్‌ని కూడా పోల్చి చూసి కొన్ని అంశాల్ని గుర్తించగలిగారు.

పంటి మీదుండే ఎనామెల్ మందాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వం ఆధారపడివుంటుంది. ఈ పొర కనుక పలుచగా ఉంటే వాళ్ళు అంతులేని ఆందోళన కలిగి, గట్టిగా అరిచే స్వభావాన్ని పొందుతారట. బైపోలార్ అనే మెంటల్ డిజార్డర్ కి గురి కావచ్చని చెబుతున్నారు. ఈ ఎనామిల్ బాగా మందంగా వున్నవాళ్లయితే మానసిక దారుడ్యం కలిగి వుంటారని, మేధోపరమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉందని తేలింది. సో.. అరచెయ్యి, జాతకచక్రం చూసి జోస్యం చెప్పడం మానేసి.. నోట్లో పాల పళ్ళు చూసి .. ఆ పిల్లవాడు పెద్దయితే ‘ఏమవుతాడో’ చెప్పెయ్యొచ్చన్నమాట.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *