దాదాపు 26 గంటల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంపై స్పష్టతనిచ్చింది ఎన్నికల సంఘం. తెలంగాణ వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. ఇది గత ఎన్నికల్లో 69.5 శాతం మాత్రమే! గతంతో పోల్చితే 3.7 శాతం పెరిగింది. శుక్రవారం రాత్రి 10.30 గంటల తర్వాత కొన్ని కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి ఈసీ  కార్యాలయానికి నివేదికలు చేరలేదు. దీంతో పోలింగ్ శాతం  ప్రకటించడం ఆలస్యమైందని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ తెలిపారు.

 

శనివారం రాత్రి 9.30 గంటలకు మీడియా ముందుకొచ్చిన ఆయన..  శనివారం తెల్లవారుజామున 3.40 గంటలకు జిల్లాల నుంచి వివరాలు అందాయని అన్నారు. పురుషుల పోలింగ్ శాతం 72.54 అని, మహిళల పోలింగ్ శాతం 73.88 గా నమోదైంది. ఆసిఫాబాద్‌లో అత్యధికంగా 85.9 శాతం కాగా, హైదరాబాద్‌లో అతి తక్కువగా 48.9 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *