ఏపీ, తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈసారి తెలంగాణలో సీనియర్లను రంగంలోకి దింపింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్గొండ), మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి) నుంచి బరిలోకి దిగనున్నారు. ఖమ్మం ఒక్కటే పెండింగ్‌లో ఉంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లకు గాను 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. అందులో 9 మంది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయగా, మరో ఏడుగురు మాజీ ఎంపీలు. నిజామాబాద్‌ నుంచి మధుయాస్కీ, హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్‌ఖాన్‌, నాగర్‌కర్నూల్‌ బరిలో మల్లురవి, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచంద్‌, సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌, వరంగల్‌ నుంచి సాంబయ్య పోటీ చేయనున్నారు.

మరోవైపు ఏపీ నుంచి 22 ఎంపీ, 132 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాకినాడ -పల్లంరాజు, బాపట్ల – జేడీ శీలం, నర్సాపురం- కనుమూరి బాపిరాజు, తిరుపతి- చింతా‌మోహన్ వంటి నేతలున్నారు. ఇక అసెంబ్లీ విషయానికొస్తే.. కల్యాణ‌దుర్గం – రఘువీరారెడ్డి, సింగనమల- శైలజానాథ్ వంటి నేతలున్నారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *