మంత్రివర్గ ఏర్పాటులో అంతులేని జాప్యం చేసి విమర్శలకు ఆస్కారమిచ్చిన కేసీఆర్.. తొలివిడత విస్తరణలో కొడుకును, మేనల్లుడిని పక్కన పెట్టి జాతీయ వార్తలకెక్కేశారు. ఇప్పుడు శాఖల కేటాయింపులో కూడా సంచలనాలకే తెరతీశారు. కీలకమైన ఆర్ధిక శాఖను ఎవ్వరికీ ఇవ్వకుండానే పోర్టుపోలియోల పంపిణీ పూర్తయింది. 22న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా.. పద్దు ప్రసంగం ఎవరు చేస్తారన్నది కొత్త సస్పెన్స్! ప్రస్తుతానికి కేసీఆర్ సహా మొత్తం తెలంగాణ క్యాబినెట్లో మంత్రుల సంఖ్య 12కి చేరింది.

 • మహమూద్ అలీ – హోమ్ శాఖ
 • జగదీశ్వర్ రెడ్డి – విద్యా శాఖ
 • కొప్పుల ఈశ్వర్ – సాంఘిక సంక్షేమ శాఖ
 • సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి – వ్యవసాయ శాఖ
 • ప్రశాంత్ రెడ్డి – రోడ్లు, భవనాలు, రవాణా శాఖ
 • ఈటల రాజేందర్ – వైద్య, ఆరోగ్య శాఖ
 • శ్రీనివాస గౌడ్ – ఎక్సయిజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు
 • చామకూర మల్లారెడ్డి – కార్మిక శాఖ
 • తలసాని శ్రీనివాస యాదవ్ – పశు సంవర్థక శాఖ
 • ఎర్రబెల్లి దయాకర్ రావు – పంచాయతీ రాజ్ శాఖ
 • ఇంద్రకరణ్ రెడ్డి – న్యాయ, అటవీ, దేవాదాయ శాఖ
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *