అమెరికాలో దారుణం జరిగిపోయింది. గుర్తు తెలియని దుండగులు ఓ తెలుగు విద్యార్థిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ స్టూడెంట్.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఈ ఘటన మిషిగన్‌‌లోని డెట్రాయిట్‌ సిటీలో జరిగింది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన 24 ఏళ్ల పూస సాయికృష్ణ.. ఎంఎస్‌ చేయడానికి నాలుగేళ్ల కిందట అమెరికాకు వెళ్లాడు. డెట్రాయిట్‌లోని లారెన్స్‌ టెక్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశాడు.

 

నెల రోజుల కిందట ఉద్యోగంలో చేరాడు. 3న రాత్రి ఓ హోటల్‌ నుంచి తాను ఉంటున్న గదికి వస్తున్న సమయం లో ఆగంతకులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సాయికృష్ణ వద్ద ఉన్న నగదు తీసుకుని దుండగులు పరారయ్యారు.నెత్తుటి మడుగులో ఉన్న బాధితుడిని ట్రాఫిక్‌ పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేయాల్సివుండడంతో అక్కడి వైద్యులు మహబూబాబాద్‌లో ఉంటున్న అతడి పేరెంట్స్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సాయికృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని భావించామని, కాల్పులు జరిగినట్లు ఇప్పుడే తెలిసిందన్నారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో సాయి ఫాదర్ ఎల్లయ్య ఆమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సాయి ఫ్రెండ్స్ క్లౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *