టెక్సాస్ లో ఓ ఎన్నారై జంట తమ ఇంట్లో  విగత జీవులై కనిపించారు.  శ్రీనివాస్ నకిరెకంటి అనే వ్యక్తి తన భార్య శాంతిని గన్‌తో కాల్చి చంపి..తానూ తనపై కాల్పులు  జరుపుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. వీరి 16 ఏళ్ళ కుమార్తె ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. వీరి కొడుకు టెక్సాస్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఓ ఎనర్జీ కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తున్న శ్రీనివాస్..తన భార్యపై ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *