లక్నో విమానాశ్రయంలో తనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడాన్ని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఖండించారు. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఆయన లక్నో నుంచి అలహాబాద్ వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకోగా పోలీసులు, భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇది ఆయనకు ఊహించని పరిణామం. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన అఖిలేష్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తానంటే భయమని, అందుకే ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారని  అన్నారు.

యోగి ఆదేశాల మేరకే పోలీసులు నన్ను ఆపేశారు అని ఆయన పేర్కొన్నారు. అసలు కేంద్ర దళాల ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయంలో ఈ రాష్ట్ర పోలీసుల ప్రవేశానికి అనుమతి లేదని, కానీ యోగి ప్రభుత్వ ఆదేశాలతో వారు ఎంటరై తనను అదుపులోకి తీసుకున్నారని ఆయన  వ్యాఖ్యానించారు. ఎలాంటి లిఖిత పూర్వక ఆదేశాలు లేకుండా నన్ను ఆపేయడం సమంజసమా అని ప్రశ్నించారు. అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం నేత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను వెళ్తున్నానంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడిందోనన డానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. అటు-బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా తన ట్విటర్‌లో యోగి ప్రభుత్వ చర్యను ఖండించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *