‘టెక్సాస్‌లో ఏది పట్టుకున్నా పెద్దదే’ అనేది ఒక నానుడి. దానికి తగ్గట్టే అక్కడో బుడతడు పుట్టుకతోనే రికార్డ్ బద్దలుకొట్టేశాడు. నేనే ‘మిస్టర్ బిగ్’ అంటూ తొడగొట్టేస్తున్నాడు. రెండు వారాలైనా నిండని ఆ పసికందు ‘టాక్ ఆఫ్ టెక్సాస్’గా వార్తల్లోకెక్కాడు. విషయం ఏమిటంటే.. జెన్నిఫర్-ఎరిక్ మెడ్‌లాక్ అనే దంపతులకు ఒక మగబిడ్డ పుట్టాడు. ఆర్లింగ్‌టన్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన సిజేరియన్ డెలివరీ తర్వాత తల్లీ బిడ్డా క్షేమంగా వున్నారు. అయితే ఏంటట? ఇక్కడే వుంది మెలిక.

ఈ బుడ్డోడి బరువు 14 పౌండ్లు.. అంటే 6 కిలోల 350 గ్రాములు. దాదాపు ఇద్దరు పిల్లలంత బరువు. జస్ట్‌బోర్న్ బేబీ సగటు బరువు ఐదారు పౌండ్ల కంటే ఎక్కువుండదు. కానీ.. యితడు ఏకంగా ఆరున్నర కిలోల బరువుతో పుట్టేశాడు. పొడవు కూడా 21.5 అంగుళాలు. డెలివరీ చేసిన డాక్టర్ కూడా నోరెళ్ళ బెట్టేశాడు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇటువంటి కేసును ఎప్పుడూ చూడలేదంటున్నాడు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లాడ్ని అపురూపంగా భావించుకుంటూ ఆలీ జేమ్స్ అని నామకరణం చేసి.. ముద్దులాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోకెల్లా అత్యంత బరువైన నవజాత శిశువు పేరు సెవిలీ. ఓహియోలో పుట్టిన ఈ చిన్నారి.. 11 గంటల తర్వాత కన్నుమూసింది. కానీ.. ఈ లిటిల్ ఆలీ మాత్రం సంపూర్ణ ఆరోగ్యంతో వున్నట్లు డాక్టర్లు సర్టిఫై చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *