వినియోగదారులు తమను అదే పనిగా విసిగిస్తే తామూ ఊరుకోబోమని అంటున్నారు మాల్స్, హోటల్స్, ఫుడ్ మార్కెట్ వంటి వాటిలో పని చేసే ఉద్యోగులు. కొందరు కస్టమర్లు పొలైట్ గా ప్రవర్తిస్తే చాలామంది మాత్రం రూడ్ గా బిహేవ్ చేస్తారని, అలాంటివారి పట్ల తాము ‘ పగ ‘ తీర్చుకునే విధానం ‘ వెరైటీ ‘ గా ఉంటుందని అంటున్నారు.

తమ ఐడెంటిటీ చెప్పడానికి ఇష్టపడని వీళ్ళంతా యాప్ విస్పర్ ద్వారా తామెలా వ్యవహరిస్తామో వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీరిలో బ్యాంకు టెల్లర్లు, బార్ సిబ్బంది, మాల్స్ ఉద్యోగులు తదితర వర్గాల వారంతా ఉన్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వినియోగదారుల భరతం పడతాం. మా పట్ల అసహనంగా, కఠినంగా, దురుసుగా ప్రవర్తించేవారికి మా తడాఖా చూపుతాం అని ముక్తకంఠంతో పేర్కొన్నారు.

‘ ఓ కస్టమర్ నన్ను తిట్టిపోశాడు. దాంతో ఒళ్ళు మండిన నేను అతను కొన్న వస్తువులు తక్కువ బరువున్నా..అతను చూడకుండా త్రాసు మీద చేతినుంచి ఎక్కువ బరువు ఉండేలా చూశా అని ఫుడ్ మార్కెట్ లో పని చేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. పైగా అతడు కొన్నవాటి ధర తక్కువైనా ఎక్కువ చెప్పా అని ఆ సేల్స్ మన్ తెలిపాడు. అలాగే..తనను దుర్భాషలాడిన ఓ వినియోగదారుని పనిని కావాలనే ఆలస్యం చేసినట్టు బ్యాంకు టెల్లర్ ఒకరు వెల్లడించాడు. మందు కొట్టి వచ్చిన ఒక యువకుడు తనను విసిగించినందుకు వైన్ లో నీళ్ళు పోసి ఇది వైట్ వైన్ అని చెప్పానని ఓ బార్ వర్కర్ చెప్పాడు. ఇలా అనేకమంది ఉద్యోగులు తాము ‘ కసి ‘ ఎలా తీర్చుకుంటామో వివరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *