అంగారక గ్రహం మీద అడుగుపెట్టే మొట్టమొదటి వ్యక్తి మహిళే కావచ్చునని నాసా ప్రకటించింది. ‘ సైన్స్ ఫ్రైడే ‘ అనే టాక్ షో లో పాల్గొన్న నాసా అధికారి జిమ్ బ్రై‌డెన్‌స్టెయిన్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ..ఇది మహిళా మాసోత్సవం గనుక తామీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఓ మహిళా వ్యోమగామి ఈ గ్రహంపై కాలు మోపే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఇందుకు కొందరు మహిళలకు అప్పుడే శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. అటు-ఈ నెల 29 న మహిళా వ్యోమగాములు యాన్ మెక్ క్లెయిన్, క్రిస్టినా కోచ్, జాకీ కగే స్పేస్ వాక్ చేస్తారని, ఇది సుమారు 7 గంటలు ఉండవచ్చునని నాసా ఇదివరకే ప్రకటించింది.

అలాగే వీరి ‘ అంతరిక్ష నడక ‘ ను గ్రౌండ్ కంట్రోల్ నుంచి అంతా మహిళా ఇంజనీర్లే పర్యవేక్షిస్తారని కూడా ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థ పేర్కొంది. వీరంతా ఇప్పటికే వివిధ దశలకు సంబంధించి గట్టి శిక్షణ తీసుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *