ఎన్టీయార్ జీవితంలోని ‘చరమాంకాన్ని’ తెరకెక్కించాలన్న రామ్ గోపాల్ వర్మ ప్రయత్నం సాకారమయ్యేలా కనిపిస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ పేరుతో ఆయన మొదలుపెట్టిన సినిమా.. చాటుమాటుగా షూటింగ్ జరుపుకుంటోందన్న క్లారిటీ వచ్చేసింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన వర్మ.. కాస్టింగ్, షూటింగ్ డీటెయిల్స్ మాత్రం ఎందుకు దాచిపెడ్తున్నారన్న సందేహం అందరిలో ఉండేది. దాన్ని కూడా పటాపంచలు చేశాడు డైరెక్టర్ వర్మ. తన మూవీలో కన్నడ నటి యజ్ఞా శెట్టిని లక్ష్మీపార్వతి రోల్‌లో నటింపజేస్తున్నాడు వర్మ. ఈ మేరకు ఆమెకు సంబంధించిన కొన్ని గెటప్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

సుగ్రీవ, లవ్ గురు లాంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మూవీస్ లో చేసిన యజ్ఞా శెట్టి.. సినిమాలు వర్కవుట్ కాకపోవడంతో రెండేళ్ల కిందట బుల్లితెరపై అరంగేట్రం చేసింది. వారసధార అనే టెలీ సీరియల్‌లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లక్ష్మిపార్వతి ఒద్దూ పొడుగుతో పాటు.. ఆమెలోని కొన్ని ‘కట్టింగ్స్’ ఈమెలో కనిపించడంతో.. వర్మ ఓకె చేసినట్లు తెలుస్తోంది.

రాకేష్ రెడ్డి నిర్మాతగా వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ షెడ్యూల్ ప్రకారం ఈనెల 24న విడుదల కావాల్సి వుంది. ఇప్పటికే వెన్నుపోటు, ఎందుకు అనే లీడ్స్‌తో సాగే రెండు లిరికల్ సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు పాత్రధారిని కూడా రివీల్ చేశాడు వర్మ. నా సినిమాలో అత్యంత కీలక పాత్ర ఇదేనంటూ వెటకారం ప్రదర్శిస్తూ చంద్రబాబు గెటప్ ని బైట పెట్టాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *