ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంలో మోదీ ప్రభుత్వం సఫలం కావడంతో టీఆర్ఎస్ ఎంపీ కవిత..మరి మహిళా రిజర్వేషన్ బిల్లు మాటేమిటని ప్రశ్నించారు. రిజర్వేషన్ల బిల్లును ఎంత వేగంగా ఆమోదించారో అంతే వేగంగా మహిళా బిల్లుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమె ట్వీట్ చేశారు. ఇదే స్పీడ్ తో కదిలితే అప్పుడు దేశం నిజమైన ప్రగతి సాధించినట్టు అవుతుందన్నారు. మహిళా బిల్లు రావాలంటే రాజకీయంగా మరింత దృఢ సంకల్పం అవసరమని కవిత అభిప్రాయపడ్డారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *