పుల్వామా ఘటన అనంతరం జమ్మూ కాశ్మీర్ లో నివసిస్తున్న ముస్లిములకు భద్రత లేకుండా పోయింది. ఉగ్రవాదులనో, టెర్రరిస్టు సానుభూతిపరులనో ముద్ర వేసి వారిపై హిందూ సంఘాలు దాడులకు దిగడంతో అనేక ముస్లిం కుటుంబాలు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాయి. నిన్నమొన్నటి వరకు తమతో సఖ్యతగా కలిసి ఉన్న కాశ్మీరీ ముస్లిములను పుల్వామా ఘటన తరువాత ఈ సంఘాలు అనుమానాస్పదంగా చూడడంతో వీరిలో ఆందోళన మొదలైంది.

అనేకమంది పొరుగునున్న హర్యానా, డెహ్రాడూన్ వంటి ప్రాంతాలకు ‘ వలస ‘ వెళ్ళడంతో ఈ రాష్ట్రంలో విచిత్రమైన అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. అయితే కిస్సు వంటి కాశ్మీరీ పండిట్లు వీరికి అండగా నిలిచారు. వారిలో భయాన్ని పారదోలి.. వారికి బాసటగా నిలిచారు. వారికి ధైర్యం చెప్పడమే గాక.. హిందూ సంఘాలకు నచ్చజెప్పడంతో.కాశ్మీరీ ముస్లిములు మళ్ళీ తమ సొంత జిల్లాలకు తరలిరావడం ప్రారంభించారు.

కాశ్మీర్ బయట చిక్కుకుపోయిన వీరిని పండిట్లు సురక్షితంగా మళ్ళీ వారి స్వస్థలాలకు తీసుకువచ్చారు. జర్నలిస్టు కూడా అయిన కిస్సు..ఈ సందర్భంగా తనకు కలిగిన అనుభవాలను వివరించారు. పాక్ టెర్రరిస్టులతో వీరికి ఏమాత్రం సంబంధం లేదని, వీళ్ళు కూడా మనలాగే ఈ భారత భూభాగంలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నవారేనని ఆమె అన్నారు. పుల్వామా ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వీరిని అభద్రతా భావం నుంచి ‘ కాపాడాల్సిన ‘ అవసరం ఉందని ఆమె అంటోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *