కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ కు అధికారం అప్పగించారని, ఈ గెలుపుతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  పోలైన ఓట్లలో 47 శాతం ఓట్లు కేసీఆర్ కు వచ్చాయని, మొత్తం 119 సీట్లలో 75 శాతం సీట్లను కట్టబెట్టిన తెలంగాణా ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఈ ఘన విజయం అంకితమని పేర్కొన్నారు.

ఆదివారం హైదరాబాద్ కూకట్ పల్లిలో తెరాస ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెరాస ఖచ్చితంగా 16 స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.ఢిల్లీని యాచించడం కాదు..శాసించే పరిస్థితి రావాలని వ్యాఖ్యానించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కొందరి ఓట్లు గల్లంతు కావడం, ఓటరు నమోదు కార్యక్రమం సమర్థంగా చేపట్టకపోవడం వల్ల టీఆర్ఎస్  అభ్యర్థులకు పలు చోట్ల మెజారిటీ తగ్గిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ తప్పు జరగకుండా చూడాలని కేటీఆర్ అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *