తెలంగాణలో మళ్ళీ హిట్టు కొట్టి.. పొలిటికల్ బాక్సాఫీసు రికార్డుల్ని బ్రేక్ చేస్తున్న తెరాస మీద టాలీవుడ్‌లో ఒక వర్గం పూలజల్లు కురిపిస్తోంది. ట్విట్టర్ ద్వారా కేసీఆర్ మెడలో అభినందన మందారమాలల్ని వేస్తోంది టాలీవుడ్ యంగ్ జెనరేషన్. సినిమా పరిశ్రమతో సన్నిహితంగా మెలిగే అలవాటున్న కేటీఆర్.. ఈసారి ఆయా సెక్టార్స్ నుంచి అనూహ్య స్పందన రాబట్టుకున్నాడు. ఎన్నికల్లో వెంట నిలబడి ప్రచారం చేయకపోయినా.. వీళ్లందరి నుంచి టీఆరెస్ నైతిక తోడ్బాటు పొందింది. ఆ ప్రభావం ఎన్నికలపై ఎంత మేర పడిందన్న సంగతి అటుంచితే.. ఇప్పుడు ఫలితం వెలువడ్డ తర్వాత టాలీవుడ్ మొత్తం టీఆరెస్ వెంట ర్యాలీ కట్టింది.

‘నీ బులెట్ దెబ్బ అదిరింది బాసూ’ అంటూ కేటీర్ ప్రొఫైల్ పిక్‌ని రీపోస్ట్ చేసిన హీరో మంచు మనోజ్.. నువ్వు చేసిన అభివృద్ధికి కృతజ్ఞతే ఈ విజయం అంటూ ఉత్సాహపూరిత ట్వీట్ చేశాడు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వున్నాడా.. ఫామ్ లో వున్నాడా.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ.. అంటూ ట్వీట్ చేశారు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఇంకా బ్రహ్మాజీ, కోనా వెంకట్ లాంటి మరికొంత మంది సినిమా సెలబ్రిటీలు కేసీఆర్ మీద తమకున్న ‘స్వామి భక్తి’ని చాటుకున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *