అమెరికాలో ఇది కనీవినీ ఎరుగని విచిత్రం ! ప్రస్తుతం సుమారు 80 ఏళ్ళ వయసున్న ముసలాయన 48 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. ఇదెలా సాధ్యం ? వివరాల్లోకి వెళ్తే.. అక్కడ  23 అండ్ మీ  వంటి వెబ్ సైట్ల ద్వారా జెనెటిక్ టెస్టులు (డీఎన్ఏ )  పాపులర్ అయిన నేపథ్యంలో ఇండియానాకు చెందిన డాక్టర్ డొనాల్డ్ క్లెయిన్ అనే పెద్దమనిషి అసలు గుట్టు ఇప్పుడు బయటపడింది. 1970, 1980 ప్రాంతంలో ఈయన తన ఫర్టిలిటీ సెంటర్‌కు వచ్చే వంధత్వ దంపతుల్లో..మహిళలకు వారి అనుమతి లేకుండానే తన వీర్యాన్నే ఇస్తూ వచ్చాడట. అలా సుమారు 50 మంది మహిళలు ఆ తర్వాత తల్లులయ్యారు. వారికి పుట్టిన పిల్లల సంఖ్య మొత్తం 48 కి చేరింది.
2016‌లో ఈ డాక్టర్ నిర్వాకం బయట పడినా అది అప్పట్లో అంతగా ప్రచారంలోకి రాలేదు. అయితే ఈ మధ్యే ఓ యువతి మరో కుటుంబాన్ని కలిసి..మాటల మధ్యలో తన ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఆ కుటుంబంలోని మరో మహిళ  కథనం  కూడా దాదాపు సేమ్ టు సేమ్ ఉండడంతో .. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు  విషయమంతా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ అక్కాచెల్లెలని తేలింది. అలా..అలా..ఈ డాక్టర్  లీల  బయటికొచ్చేసింది. అనుమానంతో.. 23 అండ్ మీ  వంటి సైట్లను వీళ్ళు పరిశీలిస్తే..ఇంకేముంది ? డీఎన్ఏ టెస్టుల మర్మం తెలిసిపోయింది.
ఇలా  ఒకే తండ్రికి పుట్టిన వీళ్ళంతా..షాక్ తింటూనే..ఓ  గ్రూపుగా ఏర్పడి ఫేస్‌బుక్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇంకా తమలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారోనని అనుకుంటున్నారు వీళ్ళంతా ! అసలు శాల్తీని (డొనాల్డ్ క్లెయిన్ ని) కదిలిస్తే తను కృత్రిమంగా వీర్యం ఇచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. మొత్తానికి దోషిగా తేలిన ఇతనికి కోర్టు ఏ శిక్ష విధిస్తుందో చూడాలి మరి.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *