చంద్రగ్రహంపైకి జపాన్ తమ రోవర్లను ప్రయోగించడానికి సిద్ధపడుతుండగా.. ప్రముఖ కార్ల కంపెనీ.. టయోటా కూడా ఇందుకు సై అంటోంది. ఇందులో భాగంగా ఈ సంస్థ.. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజన్సీ (జాక్సా)తో టైఅప్ అయింది. ఈ సన్నాహాల నేపథ్యంలో.. సౌర విద్యుత్ తో నడిచే తన తొలి రోవర్ (మైక్రోబస్) ఫస్ట్‌లుక్‌ని టయోటా విడుదల చేసింది. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్ అయిన ఈ రోవర్ తన కేబిన్‌లో ఇద్దరు వ్యోమగాములను తీసుకువెళ్లగలదు. పైగా వారు ఎలాంటి స్పేస్ సూట్లు ధరించాల్సిన అవసరంకూడా లేదట.

చంద్ర గ్రహానికి 6,210 మైళ్ళ దూరంలోని ల్యాండ్‌స్కేప్ పైకి తమ ఏస్ట్రోనట్లను పంపాలన్నది జపాన్ వ్యూహం. అయితే ఇప్పుడప్పుడే కాదు.. 2030లో ఈ ప్రయోగానికి ఇప్పటినుంచే వ్యూహరచన చేస్తోంది. అంతకుముందు సంవత్సరం అంటే..2029లో ఈ టయోటా రోవర్‌ని ప్రయోగిస్తుందట.. అంటే తమకు అవసరమైన టెక్నాలజీని ఇందుకోసం సేకరిస్తుందట. 6 మీటర్ల పొడవు, 5.2 మీ.పొడవు, 3.8 మీ. ఎత్తయిన టయోటా రోవర్.. సోలార్ పవర్ పైనే గాక.. ఫ్యుయెల్ సెల్ టెక్నాలజీ ఆధారంగా కూడా కదులుతుంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *