మెక్సికో సరిహద్దుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కడతానంటున్నగోడ అరుదైన అడవి పిల్లుల చావుకొచ్చేలా ఉంది. ముఖ్యంగా ఆరిజోనా ప్రాంతంలో చిరుతపులి చారలతో కనబడే అరుదైన అడవిపిల్లులు (ఓసిలాట్స్) చాలా తక్కువగా ఉన్నాయి. ‘ లిల్ జెఫే ‘ అని వ్యవహరించే ఇవి చూడ్డానికి పెద్ద సైజు పిల్లుల్లా, చిన్న సైజు చిరుతల్లా ఉంటాయి. ఈ మధ్య వైల్డ్ లైఫ్ కన్సర్వేషనిస్టులు రిమోట్ సెన్సర్ కెమెరాలను ఉపయోగించి ఓ అడవిపిల్లి కదలికలను క్యాప్చర్ చేశారు. సరిహద్దుల్లో గోడ నిర్మాణం జరిగితే వీటి మనుగడకు ముప్పు తప్పదని జంతు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

2009 నుంచి ఇప్పటివరకు ఈ జంతువులను ఐదింటిని మాత్రమే కనుగొన్నారు. సాధారణంగా నార్త్, సౌత్ అమెరికా అడవుల్లో కనిపించే వీటిని వేటగాళ్ళు చంపేస్తున్నారు. తమ కన్నా పెద్దవైన జంతువులను సునాయాసంగా చంపగల ఈ ఓసిలాట్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం ఈ జంతువులను అంతరించి పోతున్న జీవుల జాబితాలో చేర్చింది. అయితే హంటర్స్ దీన్ని పట్టించుకోవడంలేదు. ఈ అడవిపిల్లుల చర్మంతో చేసే కోటు ఒక్కొక్కటి 40 వేల డాలర్లు పలుకుతుందట. అందుకే వేటగాళ్ళ దృష్టి వీటిపై పడుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *