ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ క్వీన్స్‌కి తన సినిమాల్లో త‌ల్లి పాత్ర‌లు, వ‌దిన పాత్ర‌లు ఇవ్వ‌డం అంటే త్రివిక్ర‌మ్‌కి మ‌హా చెడ్డ ఆనందం. ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’లో వ‌దిన‌గా స్నేహ‌, ‘అత్తారింటికి దారేది’ మూవీలో అత్త‌గా న‌దియా, ‘అజ్ఞాత‌వాసి’లో పిన్నిగా ఖుష్బూ, ‘అర‌వింద స‌మేత‌’లో త‌ల్లిగా దేవ‌యాని.. ఇదీ త్రివిక్ర‌మ్ సినిమాల ట్రాక్ రికార్డు. మ‌రి.. ఇపుడు తాను చేయబోయే అల్లు అర్జున్ కొత్త సినిమాలో ఆ ఛాన్స్ ఏ ఓల్డ్ హీరోయిన్‌కి ద‌క్క‌నుంది?

లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ట‌బుని అప్రోచ్ కానున్నార‌ట‌ త్రివిక్రమ్. 45 ఏళ్ల టబు.. బ‌న్నీకి తల్లిగా న‌టించేందుకు అంగీక‌రిస్తుందా అనేది చూడాలి. బాలీవుడ్‌లో షాహిద్ క‌పూర్‌కి త‌ల్లిగా న‌టించింది ట‌బు. ఐతే.. టాలీవుడ్‌లో ఇప్పటికీ ఆమె యూత్‌ఫుల్ ఇమేజ్ మాత్రమే ఎస్టాబ్లిష్ అయి ఉంది.

టబు అనగానే ‘నిన్నే పెళ్లాడతా’ రొమాంటిక్ ఫీలింగ్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. ఈ క్రమంలో.. బన్నీ తల్లి పాత్రలో టబుని తెలుగు ప్రేక్షకుడు జీర్ణించుకుంటాడా? అసలు త్రివిక్రమ్ ప్రపోజల్‌కి ఆమె సై అంటుందా?.. సస్పెన్స్!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *