నియోమి రావ్..! అమెరికాలోని మరో లక్కీయేస్ట్ ఎన్నారై మహిళ. ఎందుకంటే.. అక్కడి సుప్రీమ్ కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏరికోరి ఈమెనే నామినేట్ చేసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ప్రస్తుతం ఆమె Information and Regulatory Affairs హెడ్‌గా వ్యవహరిస్తోంది. ఇంతవరకూ బాగానే వుంది. కానీ.. 1996లో మిసెస్ రావు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పదవీగండం తెచ్చిపెట్టేలా వున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారు?

”జాతి అనేది గట్టిగా మాట్లాడుకోడానికి పనికొచ్చేది.. సమాజంలో వేడి పుట్టించేది.. కొంతమందికి బాగా డబ్బు సంపాదించి పెట్టేది..” అంటూ బ్లాక్ అండ్ వైట్ వివక్ష మీద ఆమె కామెంట్ చేసింది. ఇదేమంత గొప్ప ప్రభావం చూపకపోవచ్చు. ”మహిళలపై జరిగే రేప్‌లకు మహిళలు కూడా కారకులే” అన్న మరో వ్యాఖ్య మీదే ఇప్పుడు రచ్చ మొదలైంది. 1996లో Yale Universityలో చదువుతున్నప్పుడు ఆమె రాసిన కొన్ని ఆర్టికల్స్‌లో ఈ రకమైన అంశాలు అప్పట్లోనే దుమారం రేపాయి. ”బాగా తాగిన ఆడవాళ్లు కూడా తమపై రేప్ జరిగిందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఎంత తాగుతున్నాం.. తాగిన తర్వాత ఏం చేస్తున్నాం.. ఎక్కడికెళ్తున్నామన్న స్పృహ వాళ్లలో లేకపోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి. నిందితుడితో పాటు.. బాధితురాలిని కూడా బోనెక్కించినప్పుడే.. ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది..” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారామె.

ఇప్పుడు కొలంబియా సర్క్యూట్ జిల్లాకు చెందిన ప్రతిష్టాత్మకమైన యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కి ఆమె చీఫ్ జస్టిస్‌గా నామినేట్ అవుతోంది. ఈ క్రమంలో.. నియోమి రావ్ గతంలో చేసిన కామెంట్స్ పై చర్చ మొదలైంది. అంతటి అత్యున్నత పదవికి ఆమెను నామినేట్ చేయడంపై వైట్‌హౌస్‌ని ప్రశ్నిస్తే.. ”ఎప్పుడో పాతికేళ్ల కిందట గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు కన్సిడరేషన్‌లోకి ఎలా తీసుకుంటాం..” అనే ఎదురు ప్రశ్న వినిపిస్తోంది. ఏదైతేనేం.. తప్పోఒప్పో ముక్కుసూటిగా చెప్పగలిగిన నియోమి రావ్‌కు దక్కిన ఈ ప్రమోషన్‌ని వెల్‌కమ్ చేయాల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *