అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణంపై రిపబ్లికన్లకు, డెమోక్రాట్లకు మధ్య సాగిన కోల్డ్‌వార్‌లో దాదాపు డెమొక్రాట్లదే పైచేయి అయింది. గోడ
నిర్మాణం విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. గోడకు బదులుగా స్టీల్‌తో గట్టి కంచె ఏర్పాటు చేయాలని ట్రంప్ ప్రభుత్వం
నిర్ణయించింది.

అమెరికా పాక్షిక షట్ డౌన్‌కు స్వస్తి చెప్పేందుకు తన యంత్రాంగం డెమోక్రటిక్ నేతలతో చర్చలు జరుపుతోందని ట్రంప్ తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు. గోడ నిర్మాణానికి నిధులు కేటాయిస్తేనే ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తానని ఆయన పట్టుబట్టగా.. అందుకు డెమోక్రాట్లు అంగీకరించకపోవడంతో పాక్షిక షట్ డౌన్ కొనసాగుతోంది.

 

ఇటీవల జరిగిన కాంగ్రెస్ సమావేశంలో డెమోక్రాట్లు..గోడ నిర్మాణానికి నిధుల కేటాయింపును  వ్యతిరేకించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. కాగా-నిజానికి కాంక్రీటు గోడ కన్నా స్టీల్ కంచెకే ఎక్కువ ఖర్చవుతుందని, కానీ పటిష్టంగా ఉంటుందని ట్రంప్ అంటున్నారు. పాక్షిక షట్‌డౌన్ కారణంగా వేలాది ఫెడరల్ సిబ్బందికి, కార్మికులకు జీతాల్లేక అవస్థలు పడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *