మైగ్రెంట్ల వలసను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ కట్టి తీరడానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నిర్ణయించుకున్నారు. నేషనల్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) ని ప్రకటించి అయినా సరే.. అమెరికా-మెక్సికో బోర్డర్‌లో వాల్ కట్టాలనే ఆయన డెసిషన్ తీసుకున్నారని, ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ తెలిపారు.

సరిహద్దుల్లో ‘ హ్యుమానిటేరియన్ క్రైసిస్ ‘ ని నివారించేందుకు, దేశ భద్రతకు ట్రంప్ ఇతర చర్యలు కూడా తీసుకోనున్నట్టు ఆమె చెప్పారు. గోడ నిర్మాణానికి అవసరమయ్యే 5.7 బిలియన్ డాలర్ల మంజూరు, అలాగే తాత్కాలిక షట్ డౌన్ ఎత్తివేతకు సంబంధించిన ఉత్తర్వుల మీద కూడా ట్రంప్ సంతకాలు చేస్తారని పేర్కొన్నారు.

అయితే ఇలాంటి చర్యలను తాము ఎదుర్కొంటామని, ఎమర్జన్సీ విధిస్తే కోర్టుకెక్కుతామని హౌస్‌లో డెమొక్రాట్ స్పీకర్ నాన్సీ పెలోసీ హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించడం చట్ట విరుద్ధమన్నారు. ఇది అధికార దుర్వినియోగమేనని, గోడ నిర్మాణం విషయంలో ట్రంప్ మెక్సికోను గానీ, అమెరికన్లను గానీ, ప్రజా ప్రతినిధులను గానీ సంప్రదించ లేదని, వారిని కన్విన్స్ చేయలేకపోయారని ఆమె దుయ్యబట్టారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *