వెండితెరపై కనిపించే సన్నివేశాలు రియల్ లైఫ్‌లోనూ ఒక్కోసారి జరుగుతాయి. అలాంటి ఘటనే ఒకటి బెంగుళూరులో చోటు చేసుకుంది. కన్నడ బ్యూటీ రాగిణి ద్వివేది కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టకోవడం హాట్ టాపిక్‌గా మారింది. చివరకు ఈ వ్యవహారం పోలీసులకు వరకు వెళ్లింది. ఇంతకీ ఆ వ్యక్తులెవరు? అనేదానిపై డీప్‌గా వెళ్లే.. బనశంకరి ప్రాంతంలో రిట్జ్ కార్టన్ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి శివప్రకాశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.

హీరోయిన్ రాగిణి.. తన ఫ్రెండ్, ఆర్టీఓ అధికారి రవి అనే వ్యక్తితో కలిసి శనివారం రాత్రి ఓ హోటల్‌కి వెళ్లింది. అప్పటికే అక్కడ ఆమె మాజీ ఫ్రెండ్, బిజినెస్‌మేన్ శివప్రకాశ్ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అదే సమయంలో రాగిణి- రవి అక్కడ కనిపించడంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు బిజినెస్‌మేన్. తనను వదిలేసి, వేరేవారితో తిరుగుతున్నావా? అంటూ రాగిణితో వాగ్వాదానికి దిగాడు శివ. పరిస్థితి జఠిలంకావడంతో పక్కనేవున్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేశాడు. ఎట్టకేలకు హోటల్ సిబ్బంది వీళ్లని విడిపించి రాగిణి, రవిలు అక్కడి నుంచి పంపివేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాగిని. దీంతో శివ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *