కూర్చోనివ్వదు, నిలబడనివ్వదు.. మనసును నెమ్మదిగా ఉండనివ్వదు.. బుర్రను కదలనివ్వదు..! ఒక్క వెన్నునొప్పితో ఎన్ని సమస్యలు. పడేవాడికే తెలుస్తుంది ఆ నరకం. కానీ.. ఏ రకమైన వెన్నునొప్పి ప్రమాదకరం.. ఏ వెన్నునొప్పి తాత్కాలికం అనే కామన్ సెన్స్ అందరిలో ఉండాల్సిందే. అలా అయితేనే.. ప్రతీ వెన్నునొప్పికీ ఆదుర్దా పడిపోకుండా.. కాస్తంత వెనక్కి తిరిగి చూసి ఆలోచిస్తాం. ‘లోయర్ బ్యాక్ పెయిన్’.. ప్రతి ఎనిమిది మందిలో ఒకరిని వేధించే సాధారణ సమస్య. 80 శాతం మందికొచ్చే Lower back pain.. నిర్లక్ష్యపరచదగ్గదేనని ఆర్థోపెడిక్ స్పెషలిస్టులు తేల్చారు. మరి.. ఏ తరహా వెన్నునొప్పుల్ని సీరియస్‌గా తీసుకోవాలి..?

  • వెన్నునొప్పితో పాటు.. మూత్రాశయం మీద అదుపు లేకుండా పోవడం.


  • వెన్నునొప్పితో పాటు జ్వరం రావడం.


  • కాలినొప్పితో పాటు కలిసి వచ్చే వెన్ను నొప్పి.


  • మెడ కింద.. వెన్నుపూస పైభాగంలో వచ్చే నొప్పి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *