ఉదయ్ కిరణ్ బయోపిక్.. ఫేక్ న్యూస్

దివంగత నటుడు ఉదయ కిరణ్ పై బయో పిక్ కి తాను దర్శకత్వం వహించనున్నట్టు వచ్చిన వార్తలను డైరెక్టర్ తేజ ఖండించాడు. ఇది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు. (2000 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ కి ఉదయ్ కిరణ్ ని తేజ ఇంట్రొడ్యూస్ చేసిన విషయం గమనార్హం) .

ఉదయ్ లైఫ్ పై తానేమీ చిత్రం చేయడం లేదని, ఈ రూమర్ ఎవరు పుట్టించారో తెలియదని చెప్పిన ఆయన..అలాంటి ప్లానే తనకు లేదన్నాడు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని తేజ చెప్పాడు. కాగా..దగ్గుబాటి రానాతో నేను ఓ కమర్షియల్ చిత్రం చేయబోతున్నా అని తేజ తెలిపాడు. ఈ సినిమాలో రానా పైలట్ గా నటిస్తున్నాడన్న వార్తలను ఆయన తోసిపుచ్చాడు.