పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు దేశమంతా సంతాపం తెలుపుతుంటే.. కేరళకు చెందిన ఓ జవాన్ శవపేటిక వద్ద కేంద్రమంత్రి ఆల్ఫోన్స్‌ కన్నన్‌తానమ్ సెల్ఫీ దిగారు. అంతేకాదు ఆ పిక్‌ని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ సెల్ఫీపై నెటిజన్లు మండిపడుతున్నారు. వీర సైనికుని శవపేటిక ముందు సెల్ఫీలు దిగటమేమిటని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. నెటిజన్లు చేస్తున్న విమర్శలకు బదులిచ్చారు మంత్రి ఆల్ఫోన్స్.

40 ఏళ్లుగా ప్రజలతో ఉంటూ విధులను నిర్వర్తిస్తూనని, తన దేశభక్తిని ప్రశ్నించేవాళ్లకి ఇచ్చే సమాధానం ఒక్కటే.. తనకు కలెక్టర్ హోదానో, మంత్రి పదవో అవసరం లేదని, తన తండ్రి కూడా సైనికుడేనని, ఆ బాధ అంటే ఎలా వుంటుందో తెలుసని, మన కోసం ప్రాణాలు త్యాగం చేసిన సైనికులకు వందనం తెలుపుతున్నానని తెలిపారు. గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ఆవాసగృహంలో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులతో నిద్రిస్తూ దిగిన సెల్ఫీ ఫొటోని పోస్ట్ చేసి ఆయన వార్తల్లోకి వచ్చిన విషయం తెల్సిందే!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *