ఇదొక అంతర్జాతీయ తొండాట వివాదం. ఫిగర్ స్కేటింగ్‌లో ఆరితేరిన ఇద్దరు ఆడపిల్లలు గెలవడం కోసం చేసిన ఒక చీప్ ట్రిక్ ఇప్పుడు క్రీడాప్రపంచంలో రచ్చకు దారితీసింది. జపాన్‌లో ISU World Figure Skating ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. 22 ఏళ్ల మరియా బెల్ అనే అమెరికా పిల్ల.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ కొట్టాలనుకుంది. తనకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న పదహారేళ్ళ కొరియన్ అమ్మాయి లిమ్ ఎన్సూ మీద కన్నేసింది.

ఫైనల్ ఈవెంట్ జరగడానికి ముందు ఉమెన్స్ షార్ట్ ప్రోగ్రాం పేరిట ఒక కాంపిటీషన్ నిర్వహించారు. ఆ సమయంలో తన స్కేట్‌లోని బ్లేడ్‌తో కొరియన్ స్కేటర్‌ని గాయపరిచిందట మరియా బెల్. కోడి కత్తిలా పదునుగా వుండే ఈ బ్లేడ్‌ గీసుకోవడంతో ఆమె మోకాలి వద్ద కోసుకుపోయిందట. తర్వాత యధావిధిగానే ఇంటర్నేషల్ ఫైనల్ పోటీ జరిగింది. గాయపడ్డ కొరియన్ పిల్ల వీరోచితంగా పోరాడి పర్సనల్ బెస్ట్ స్కోర్ సాధించింది. మొత్తమ్మీద ఐదో స్థానంలో నిలిచింది. అమెరికన్ స్కేటర్ మీద ఒక అడుగు పైనే నిలబడింది.

ఈ మొత్తం వ్యవహారం ముగిసిన తర్వాత.. కొరియన్ స్కేటర్ కాలికి గాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. చిన్నపాటి బ్యాండేజ్ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇది ఆ అమెరికా పిల్ల చేసిన పనేనని, తన స్కేటింగ్ బ్లేడ్‌తో ఉద్దేశపూర్వకంగానే గాయపర్చిందని అభియోగం నమోదైంది.

కానీ.. ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ దీనిపై ప్రాధమిక దర్యాప్తు జరిపి.. వీడియో ఫుటేజ్ చూసి.. సరైన సాక్ష్యాధారాల్లేవంటూ ఆరోపణల్ని తోసిపుచ్చింది. మొత్తమ్మీద ఈ ఇద్దరు ఆడపిల్లల రగడ స్కేటింగ్ స్పోర్ట్స్ వరల్డ్‌ని ఊపేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *