మరో పదిరోజుల్లో ఎన్టీయార్ అభిమానులకు మరో పెద్దపండగ! ఎట్టకేలకు ‘ఎన్టీయార్ మహానాయకుడు’ విడుదల తేదీని ఖరారు చేశాడు బాలయ్య. ఫిబ్రవరి 22న సినిమా విడుదల ఖాయం అంటూ అధికారిక ప్రకటన బైటికొచ్చింది. మూడుసార్లు వాయిదా పడ్డ రిలీజ్ డేట్‌పై ఇప్పుడు ఫైనల్ క్లారిటీ రావడంతో నందమూరి ఫ్యాన్ క్లబ్ ఖుషీ అవుతోంది. ఎన్టీయార్-చంద్రబాబు కాంబినేషన్ సీన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ సోషల్ మీడియాలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇటీవలే సారధీ స్టూడియోస్‌లో ఆఖరి షాట్ పూర్తి చేసి షూటింగ్ పార్ట్‌కి గుమ్మడికాయ కొట్టేసింది క్రిష్ టీమ్. ‘బ్లూ ప్రింట్’ని అనేక సార్లు మార్చి.. తీసిన కొన్ని సీన్లను డిలీట్ చేసి రీషూట్ చేసి.. ఎలాగోలా కానిచ్చామనిపించిందట.

ఇటు.. ‘ఎన్టీయార్’ బయోపిక్‌కి కౌంటర్ ప్రాజెక్టు సిద్ధం చేస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా అప్రమత్తయ్యాడు. ఫిబ్రవరి 14 ఉదయం 9.27 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు వర్మ. థియేట్రికల్ ట్రైలర్ కూడా సిద్ధం చేసి.. ‘మహానాయకుడు’ విడుదల రోజు బైటికి వదులుతానని, ‘మహానాయకుడ్ని’ చూడ్డానికొచ్చే ప్రేక్షకుడికి లక్ష్మీస్ మహానాయకుడిని బోనస్‌గా చూపిస్తానని సెటైర్ వేశాడు వర్మ.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *