క్రిష్ ‘ఎన్టీయార్’ సందడి ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టీ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మూవీ మీద పడింది. ఎన్టీయార్ అసలైన బయోపిక్ ఇదేనంటూ ఒక వర్గం విస్తృతంగా ప్రచారం చేయడంతో సహజంగానే ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. స్టార్ కాస్ట్ లేకపోయినా సినిమా సర్కిల్స్‌ని ఊరిస్తోంది. ఎన్నికల సీజన్ కావడంతో.. పొలిటికల్ సర్కిల్స్‌లోనూ సెగ పుట్టిస్తోంది. కానీ.. ఇది రామ్ గోపాల్ వర్మ ప్రాజెక్ట్ కావడంతో.. మూవీ విడుదల మీద కొత్తగా సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

వెన్నుపోటు పాట, టీజర్, ట్రైలర్‌లతో వేడి పుట్టించి, రాజకీయ పార్టీల్ని, సోషల్ మీడియాని మునివేళ్ళ మీద నిలబెట్టి.. ఇప్పుడు సడన్‌గా వర్మ సైలెంట్ అయ్యాడు. సినిమా ప్రొడక్షన్ దాదాపు పూర్తయి, రీరికార్డింగ్ వర్క్స్ మొదలైనట్లు ఇంటర్నల్ ఫీలర్లు వస్తున్నప్పటికీ.. ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ మీద వర్మకు సెకండ్ థాట్స్ ఉన్నట్లు చెబుతున్నారు. విడుదల తేదీని ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసింది యూనిట్. చివరకు మార్చి 15వ తారీఖున రిలీజ్ చేయనున్నట్లు అనధికారిక వార్తలొచ్చాయి. కానీ.. ఆకస్మికంగా ప్రమోషన్ నిలిపివేసిన వర్మ అంతరంగం ఏమిటన్న ప్రశ్న టాలీవుడ్‌లో మొదలైంది.

మూవీ ‘అవుట్‌ఫుట్’ని వర్మ పునస్సమీక్షిస్తున్నారని, ‘ఆన్ సెట్స్’ డైరెక్టర్ అగస్త్య మంజు పనితీరు మీద అసంతృప్తిగా వున్నారని తెలుస్తోంది. నాసిరకం సీన్లను తొలగించి, రీషూట్ చేసే ప్రపోజల్‌ని కూడా వర్కవుట్ చేస్తున్నారట. తన మూవీ ద్వారా ఏ పార్టీకి పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తారన్న అంశంపై వర్మ.. మరికాస్త సస్పెన్స్ పెంచేస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *